ప్రముఖ నటి నమిత తల్లికాబోతోంది. ఈ విషయాన్ని మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా నమిత సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఆమె షేర్ చేసిన బేబీ బంప్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం నమిత నటిగానే కాకుండా నిర్మాతగాను రాణిస్తోంది. ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. 2017లో తన బాయ్‌ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. తెలుగులో సొంతం, జెమినీ, బిల్లా, సింహా సినిమాలతో నమిత మంచి విజయాలను అందుకుంది.