ఇషాన్ సూర్య దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విష్ణు మంచు ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ మరియు బాలీవుడ్ యాక్ట్రెస్ సన్నీలియోన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. గ్లామర్ బ్యూటీ పాయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సినిమా సెట్స్ నుండి మంచు విష్ణుతో కలిసి ఉన్న ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది. మార్నింగ్ షూటింగ్స్ ఇలా ఉంటాయి ... అంటూ ఈ బ్యూటీ కాప్షన్ ఇచ్చింది. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ అండ్ స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కి అనూప్ రూబెన్స్ సంగీత అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa