ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరేష్ అగస్త్య తదుపరి చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 03:09 PM

మత్తు వదలారా, సేనాపతి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి క్రేజీ టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాకి 'మెన్ టూ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సంయుక్త హెగ్డే, మెగా ఆకాష్, దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమా టైటిల్ లుక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సమాజంలో మగవాళ్ల సమస్యలను వినోదాత్మకంగా ఈ సినిమా చూపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. రియా సుమన్ ప్రియాంక శర్మ ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో హర్ష చెముడు, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లాంతర్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మౌర్య సిద్దవరం ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎలీషా ప్రవీణ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa