ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'శేఖర్' సినిమాలోని చిన్ని చిన్ని ప్రాణం లిరికల్ సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 03:06 PM

ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ తన 91వ సినిమాని లలిత్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'శేఖర్' అనే టైటిల్ మూవీ మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమా మే 20, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మలయాళ థ్రిల్లర్ జోసెఫ్ సినిమా అధికారిక రీమేక్. ఈ సినిమాలో అను సితార అండ్ ముస్కాన్ ఖుబ్‌చందానీ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం నుండి 'చిన్ని చిన్ని ప్రాణం' సాంగ్ ని రిలీజ్ చేసారు. అనూప్ రూబెన్స్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా చిన్మయి మరియు హైమత్ మహమ్మద్ పాడారు. లక్ష్య ప్రొడక్షన్స్ అండ్ పెగాసస్ సినీ కార్ప్‌పై MLV సత్యనారాయణ, శివాని, శివాత్మిక అండ్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa