ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ 'ది వారియర్' టీజర్ కి టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 03:08 PM

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, లింగుస్వామి దర్శకత్వంలో "వారియర్" సినిమా  చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి అండ్ అక్షర గౌడ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. జులై 14, 2022న ఈ సినిమాని థియేటర్లలో విడుదల కానుంది. రామ్ తన కెరీర్‌లో తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ 'ది వారియర్' టీజర్‌ను మే 14, 2022 సాయంత్రం 05:31 గంటలకు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఒక అనౌన్స్‌మెంట్ పోస్టర్ ని కూడా విడుదల చేసారు. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa