యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం "రాజా వారు రాణి గారు", "ఎస్ఆర్ కళ్యాణమండపం" సినిమాలతో హిట్ సాధించాడు. అతని చివరి చిత్రం 'సెబాస్టియన్ పిసి 524' బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. తాజాగా ఈ యంగ్ హీరో జూన్ 24న 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రవీణ కె ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించారు. అంతేకాకుండా 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అనే సినిమా కూడా ఆగస్ట్‌లో విడుదల కానుంది. ఏఎమ్ రత్నం, ఏషియన్ సునీల్ బ్యానర్లతో సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలు త్వరలో సెట్స్‌పైకి రానున్నాయి. 'GA2 పిక్చర్స్' మరియు 'మైత్రి మూవీ మేకర్స్' వంటి పెద్ద బ్యానర్లలో ప్రాజెక్ట్‌ల కి కూడా సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa