ప్రముఖ నటి, హీరోయిన్ ముంతాజ్ పై ఓ బాలిక గృహ హింస ఆరోపణ చేసింది. గత కొన్ని రోజులుగా ముంతాజ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ తరుణంలో తన ఇంట్లో పని చేసే ఓ బాలిక తనపై ఆరోపణ చేసింది. ముంతాజ్ పై తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తన ఇంట్లో పని చేసే బాలిక ఫోన్ చేసి ఆరోపణ చేసింది. తన సొంతూరికి వెల్లడానికి ముంతాజ్ ఒప్పుకోవడం లేదని, తనను హింసిస్తోందని ఆ బాలిక ఫిర్యాదు చేసింది.
పోలీసులు వెంటనే ముంతాజ్ ఇంటికి వెళ్లగా ఆ ఇంట్లో మరో బాలిక కూడా ఉంది. దీంతో చెన్నైలోని బాలల సంరక్షణ కేంద్రానికి ఆ ఇద్దరు బాలికలను పోలీసులు పంపించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ బాలిక ముంతాజ్ ఇంట్లో గత 6 ఏళ్లుగా పనిచేస్తోందని పోలీసులు తెలుసుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు ముంతాజ్‌పై బాల కార్మిక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ముంతాజ్ తెలుగులో జెమినీ, ఖుషి, ఆగడు, కూలీ, తదితర సినిమాల్లో నటించి మెప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa