బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న చారిత్రక నేపధ్య చిత్రం పృథ్విరాజ్. ఆర్ ఆర్ ఆర్ , కేజీఎఫ్ 2 వంటి లార్జర్ దాన్ లైఫ్ చిత్రాల తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం ఇది. బాలీవుడ్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్స్ జోధా అక్బర్, పద్మావత్, బాజీరావ్ మస్తానీ, పానిపట్ తర్వాత బాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో బిగ్ బడ్జెట్ చిత్రం ఇదే. వందలకొద్దీ జూనియర్ ఆర్టిస్టులతో ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం కూడా చాలా గ్రాండ్ గా ఉండేటట్టు కనిపిస్తుంది. పృథ్విరాజ్ చౌహన్ చక్రవర్తి జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 2017 ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్, సోనూసూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను ఎక్కడా రాజి పడకుండా చాలా గ్రాండ్ గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషలలో జూన్ 3న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుండి మొదటి లిరికల్ పాట విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది. హరి హర అంటూ సాగే ఈ పాటలో పృథ్వి రాజ్ వీరోచిత్వాన్ని, ఆయన పరాక్రమాన్ని చూపించారు. ఈ సినిమాకుగాను ఐదుగురు సంగీతదర్శకులు పని చేసారు. హరిహర పాటను శంకర్ లోయ్ స్వరపరిచారు. వరుణ్ గ్రోవర్ సాహిత్యాన్ని అందించగా, ఆదర్శ్ షిండే అద్భుతంగా ఆలపించారు.
Witness the power of a true Samrat. Watch #HariHar song and experience the magic of Samrat Prithviraj Chauhan - https://t.co/KPBI33QZYr
Releasing in Hindi, Tamil and Telugu. Celebrate Samrat #Prithviraj Chauhan with #YRF50 only at a theatre near you on 3rd June. pic.twitter.com/lYzuNnlDI8
— Yash Raj Films (@yrf) May 12, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa