ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారతీయ సినిమాల సందడి... మాధవన్ నంబి ఎఫెక్ట్ కూడా ...

cinema |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 09:04 PM

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఈ నెల్ 17 నుండి 28 వరకు ఫ్రాన్స్ లో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల ఉత్తమ సినిమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు భారత్ నుండి కొంతమంది ప్రముఖ సినీతారలు హాజరుకాబోతున్నారు. వారిలో మ్యూజిక్ దిగ్గజం ఏ ఆర్ రెహ్మాన్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, ఆర్. మాధవన్ ఉన్నారు. గ్లామర్ బ్యూటీ దీపికా పదుకొణె కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ గా రెడ్ కార్పెట్ పై నడవనుంది. ఈ ఫెస్టివల్ లో భారతదేశం నుండి 5 సినిమాలు


ప్రదర్శితమవుతున్నాయి. వాటిలో కోలీవుడ్ సీనియర్ హీరో ఆర్. మాధవన్ నటించిన రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్ కూడా ఒకటి. ఈ సినిమాకు మాధవన్ దర్శకత్వం వహించారు.దర్శకుడిగా మాధవన్ కు ఇదే తొలి సినిమా. రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణ్ ఎదుర్కొన్న ఒక విపరీత పరిస్థితిని ఆధారంగా చేసికొని ఈ సినిమా తెరకెక్కింది. ఇంగ్లీష్, హిందీ ,తమిళ భాషలలో జూలై 1న ఈ సినిమా విడుదల కానుంది. 


ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడే మిగిలిన నాలుగు భారతీయ సినిమాలు :


ట్రీ ఫుల్ ఆఫ్ పార్రోట్స్ (మలయాళం), దర్శకుడు : జయరాజ్ 


ధూయిన్ (హిందీ-మరాఠీ), దర్శకుడు: అచల్ మిశ్ర


బూమ్బా రైడ్; దర్శకుడు: బిశ్వజిత్ బోరా 


ఆల్ఫా బీటా గామా (హిందీ) , దర్శకుడు: శంకర్ శ్రీ కుమార్ 


గోదావరి (మరాఠీ), దర్శకుడు: నిఖిల్ మహాజన్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa