హీరో మహేశ్ బాబుపై దర్శకుడు హరీశ్ శంకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మహేశ్ బాబు స్టయిలిష్ ప్రదర్శన, టైమింగ్ అద్భుతం అని పేర్కొన్నారు. పరశురాం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సర్కారు వారి పాట’ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన దర్శకుడు హరీశ్ శంకర్ ప్రశంసల జల్లు కురిపించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు స్టయిలిష్ ప్రదర్శన, టైమింగ్ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ‘సర్కారు వారి పాట’ సినిమా చూస్తే గొప్ప అనుభూతిని పొందవచ్చని ఆయన అన్నారు.
పరశురాం ఈ సినిమా కథను రాసుకున్న తీరు, ఈ సినిమాలోని కీలక పాత్రలను అద్భుతంగా చూపించిన తీరుకు అభినందనలు చెబుతున్నానని హరీశ్ శంకర్ పేర్కొన్నారు. మైత్రీ మూవీస్ వారు ఈ సారి దిష్టి తీయించుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ నటించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa