తనకు ఎందుకు పెళ్లి కాలేదో అసలు వాస్తవం చెప్పుకొచ్చింది బాలివుడ్ భామ కంగనా రనౌత్. తన విషయంలో వదంతులు వ్యాప్తి చేస్తుండడం వల్లే తాను వివాహం చేసుకోలేకపోయినట్టు కంగనా రనౌత్ అన్నారు. ఈ వదంతులే తనను సరైన జోడీని గుర్తించకుండా అడ్డుపడినట్టు ఆమె నవ్వుతూ చెప్పారు. కంగన నటించిన గూఢచార, యాక్షన్ ఆధారిత 'ధాకడ్' సినిమా త్వరలో విడుదల కానుండడం తెలిసిందే.
నిజ జీవితంలోనూ టామ్ బోయ్ మాదిరిగానే ఉంటారా? అంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా కంగనా రనౌత్ ఒక ప్రశ్న ఎదుర్కొంది. దీనికి ఆమె నవ్వుతూ.. ‘‘నేను అలా ఉండను. నిజ జీవితంలో నేను ఎవరిని కొట్టాను? చూపించండి. మీ లాంటి వ్యక్తులు ఈ తరహా పుకార్లను వ్యాప్తి చేయడం వల్లే నేను పెళ్లి చేసుకోలేకపోయాను’’ అని ఆమె బదులిచ్చారు. కఠినంగా ఉంటారన్న అభిప్రాయం వల్లే పెళ్లి చేసుకోలేకపోయారా? అని అడగ్గా.. 'అవును నేను అబ్బాయిలను కొడతానన్న పుకార్లు వ్యాపించడం వల్లే' అని ఆమె చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa