సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన సర్కారువారిపాట ఎట్టకేలకు నిన్ననే ధియేటర్లలోకొచ్చింది. పరశురామ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కధానాయిక. థమన్ సంగీత దర్శకుడు. మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ కు మాత్రం భీభత్సంగా నచ్చేసింది. మహేష్ యాక్టింగ్ కు, డైలాగ్స్ కు, డాన్సులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఈ సినిమాను YSRCP రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్ననే చూడటం జరిగింది. ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియచేసారు. సినిమా కథాకథనాలు చాలా బావున్నాయని, మహేష్ బాబు నటన అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. కాంటెంపరరీ ఇష్యూస్ మీద తీసిన ఈ సినిమా ప్రజలకు సమాచారం అందించే విధంగా ఉంది. పేద ప్రజలకు, ధనికులకు లోన్లు ఇవ్వటంలో బ్యాంకులు చూపించే భిన్న ధోరణిని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మహేష్ బాబుగారికి హార్దిక శుభాకాంక్షలు... అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa