సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారువారిపాట. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్లో ఫుల్ మాస్ మసాలా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం మే 12న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. మహేష్ బాబు స్టైలిష్ పెర్ఫార్మెన్స్, యాటిట్యూడ్, కీర్తి తో కెమిస్ట్రీ, సాంగ్స్ ,ఫైట్స్, అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. విశేష ప్రేక్షకాదరణ తో మూడు రోజులలోనే 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ , 72. 22 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ సూపర్ హిట్ అయిన సందర్భంగా ఎస్ టి బి సి గ్రౌండ్స్ , ప్రకాష్ నగర్ , కర్నూలు లో మ మ మాస్ సెలబ్రేషన్స్ పేరిట SVP విజయోత్సవ వేడుకలు ఈ రోజు జరపనున్నట్టుగా మేకర్స్ ట్వీట్ చేశారు. ముందుగా ఈ సంబరాలు విజయవాడలో జరగాల్సింది కానీ వెన్యూ మార్చినట్టు మేకర్స్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa