అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. వేసవి లో ప్రేక్షకులను ఉల్లాసపరచటానికి మే 27న ఈ చిత్రం విడుదల కానుంది. తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాడా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, సోనాల్ చౌహన్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా, DSP మ్యూజిక్ డైరెక్షన్లో విడుదలైన లబ్ డబ్ డబ్బో, ఊఁ ఆఁ ఆహా ఆహా పాటలు మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ మూవీ నుండి పూజాహెగ్డే ఐటెం సాంగ్ ప్రోమో రిలీజయ్యింది. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అని సాగే ఈ ప్రోమోలో వెంకటేష్, వరుణ్ లతో కలిసి పూజా వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. జిగేలుమనే భారీస్ సెట్స్ లో, నటీనటుల కలర్ ఫుల్ ఔట్ ఫిట్ లతో ఈ ప్రోమో మంచి పార్టీ మూడ్ ను తీసుకొస్తుంది. ఈ పూర్తి పాటను మే 17న అంటే రేపు విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa