నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన మహానటి సినిమాలో జంటగా కనిపించారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంతలు. ఆ సినిమాలో వాళ్లిద్దరూ కనిపించేది కొంచెంసేపే అయినా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్టు కనిపిస్తుంది. దీంతో వీరి కాంబోలో ఫుల్ లెంగ్త్ సినిమా రావాలని ప్రేక్షకులు కోరుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ని తన భుజాన వేసుకున్నాడు డైరెక్టర్ శివ నిర్వాణ. ఇటీవలే హైదరాబాద్ లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైన ఈ మూవీ ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొంచెంసేపటి క్రితమే చిత్రబృందం విడుదల చేసింది. గతంలో వచ్చిన పుకార్ల ప్రకారమే ఈ సినిమాకు ఖుషి టైటిల్ ను ఖరారు చేసారు. పోస్టర్ ను బట్టి ఈ మూవీ రొమాంటిక్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక, విజయ్ సమంతల పెయిర్ చాలా ఫ్రెష్ గా, కూల్ గా కనిపిస్తుంది. విజయ్, సమంతల కొంగుముడిని చూపిస్తూ అత్యంత క్లిష్టమైన ముడి అంటూ పేర్కొనటంతో, ఈ మూవీ వివాహ బంధంలోని ఒడిదుడుకులను చూపిస్తుందేమో అనిపిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో డిసెంబర్ 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ టైటిల్ ను ఎంచుకున్న శివ నిర్వాణ బృందం ఒక పెద్ద సాహసానికి పూనుకున్నట్లే. ఈ మూవీ కాస్త అటు ఇటైనా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికాక తప్పదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa