ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూయార్క్ లో విక్కీకౌశల్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. కత్రినా ఎమోషనల్ పోస్ట్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 04:26 PM

బాలీవుడ్ మోస్ట్ అడారబుల్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.  గతేడాది డిసెంబర్ లో వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట అప్పటినుండి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్న ఫొటోలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ, విక్కీ కోసం కత్రినా రుచికరంగా వంటలు చెయ్యటం, ఇద్దరూ కలిసి వెకేషన్ ఎంజాయ్ చెయ్యటం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యటం... ఇలా గత ఆరునెలల నుండి విక్కీ కత్రినాలు అభిమానులకు కన్నుల పండగ చేస్తున్నారు. 


తాజాగా ఈ రోజు విక్కీ కౌశల్ పుట్టిన రోజు సందర్భంగా కత్రినా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. విక్కీ పుట్టినరోజుని పురస్కరించుకుని, గత వారం రోజులుగా న్యూయార్క్ వెకేషన్ లో ఉంది ఈ జంట. ఈ మేరకు విక్కీ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను కత్రినా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నీ రాక నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అంటూ కామెంట్ చేసింది. ఈ క్యూట్ కపుల్ అడారబుల్ పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa