పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం 'సర్కారువారిపాట'. కీర్తిసురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా మాస్ సెలెబ్రేషన్స్ వేడుకలో ఏపీలోని కర్నూల్ లో జరిగింది. అయితే ఈ వేడుకలో 'మా మ మహేశా' పాటకు డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్టెప్పులేసారు. అయితే సడన్ గా మహేష్ కూడా స్టేజ్ పైకి వెళ్లి మాస్ స్టెప్పులు వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa