మంగళవారం సాయంత్రం నుండి కేన్స్ ఫిలిం వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 17 నుండి 28 వరకు నిర్విరామంగా జరిగే ఈ వేడుకలలో భారత్ నుండి కొంతమంది సినీ తారలు కూడా హాజరవబోతున్నారు. ఫ్రాన్స్ దేశంలోని కేన్స్ నగరంలో జరుగుతున్న 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు భారత్ నుండి ఏఆర్ రెహమాన్, శేఖర్ కపూర్, మాధవన్, నవాజుద్దిన్ సిద్ధిఖి, తమన్నా, నయనతార, పూజా హెగ్డే, ఊర్వశి రౌతేలా, హేలీ షా, హీనా ఖాన్ తదితరులు పాల్గొంటున్నారు. నిన్న సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కలిసి నటులు నవాజుద్దిన్, మాధవన్, దర్శకుడు, నటుడు శేఖర్ కపూర్, సంగీతదర్శకుడు రిక్కీ కేజ్, సీబీఎఫ్‌సి చైర్ పర్సన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్‌సి సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.భారత్ నుండి కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా తెలుపు, నలుపు కలగలసిన డ్రెస్ లో మెరిసిపోయింది. ఒంటికి అతుక్కుపోయే ఈ గౌన్ లో తమన్నా చాలా అందంగా, క్యూట్ గా ఉంది. తమన్నా కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేన్స్ ఫెస్టివల్లో తమన్నా పాల్గొనటం ఇదే తొలిసారి. కేన్స్ నుండి తిరిగొచ్చిన వెంటనే తన కొత్త చిత్రం ఎఫ్ 3 ప్రమోషన్స్ లో తమన్నా పాల్గొంటుంది. ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 27న విడుదల కానుంది.
And here comes the ultimate fashionista, #TamannaahBhatia! She is ready to take over the red carpet at #Cannes2022 with utmost grace. pic.twitter.com/uXHPRN95t7
— Filmfare (@filmfare) May 17, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa