ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కన్మణి రాంబో ఖతీజా' ఈ తేదీన OTTలో విడుదల కానుందా?

cinema |  Suryaa Desk  | Published : Wed, May 18, 2022, 02:01 PM

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ సమంత నటించిన 'కాతువాకుల రెండు కాదల్' సినిమా ఏప్రిల్ 28న విడుదలయ్యింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార అండ్ విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రలు  పోషిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాని తెలుగులో కూడా 'కన్మణి రాంబో ఖతీజా' పేరుతో విడుదల చేసారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రలో ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా తమిళనాడులో సాలిడ్ కలెక్షన్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా OTTలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 27న డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ సినిమా ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని లేటెస్ట్ టాక్. విఘ్నేష్ శివన్‌ల రౌడీ పిక్చర్స్ అండ్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa