ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆది సాయికుమార్ 'క్రేజీ ఫెలో' సినిమా ఫస్ట్ లుక్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 04:39 PM

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో బాక్స్ఆఫీస్ వద్ద పెద్దగా ప్రాభవం ఏమి చూపలేదు. తాజాగా ఫణి కృష్ణ దర్శకత్వంలో ఆది సాయికుమార్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించాడు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. 'క్రేజీ ఫెలో' అనే టైటిల్‌ ని మూవీ మేకర్స్ ఈ సినిమాకి లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ లో ఆది సాయికుమార్ కూల్‌ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. కే కే రాధా మోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ధృవన్ సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa