అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో స్టార్ కమెడియన్ సుధీర్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కాలింగ్ సహస్ర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు సుధీర్ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఈ యాక్టర్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. అంతేకాకుండా, ఈ చిత్రం మొదటి సింగిల్ త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌కి సంబంధించినది అని సమాచారం. 'కాలింగ్ సహస్ర' సినిమా అనేది ఒక నగరంలో మహిళలపై జరుగుతున్న అనేక నేరాలను ప్రస్తావించే క్రైమ్ థ్రిల్లర్ అని డైరెక్టర్ అరుణ్ వెల్లడించారు. ఈ సినిమాలో సుధీర్ సరసన డోలీషా జోడిగా నటిస్తుంది. శివబాలాజీ, మనోహరన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మోహిత్ రెహమానియాక్ ఈ సినిమాకి సంగీత అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని షాడో మీడియా ప్రొడక్షన్స్‌తో కలిసి రాధా ఆర్ట్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa