టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల విడుదలైన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ యంగ్ హీరో తనకు తానుగా కొత్త మెర్సిడెజ్ గ్వాగన్‌ను బహుమతిగా ఇచ్చుకున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, విశ్వక్ సేన్ తన రెమ్యూనరేషన్ ని పెంచినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక సినిమాకి కోటి రూపాయలు తీసుకుంటున్న ఈ యంగ్ హీరో ఇకపై తన రెమ్యూనరేషన్ ని మూడు కోట్లకు పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa