టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి బాలకృష్ణతో తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఈ చిత్రం మొత్తం తండ్రి మరియు అతని కూతురు గురించి వెళ్తుంది అని చెప్పాడు. ఈ చిత్రంలో బాలయ్య 45 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నట్లు వెల్లడించారు. బాలయ్య ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసాక ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమవుతుంది అని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK107' సినిమాతో బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa