ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గీతా మాధురి, బాబు గోగినేని మ‌ధ్య జ‌రిగిన సీరియ‌స్ డిస్క‌ష‌న్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 27, 2018, 10:42 AM

బిగ్ బాస్ సీజ‌న్ 2.. 46వ ఎపిసోడ్‌లో ఛాన్స్ టు టాక్‌లో భాగంగా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోయిన దీప్తి సునైనా, గణేష్, నందినిలకు ఫోన్‌ మాట్లాడేందుకు బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇందుకోసం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందులో మొద‌టిది ఈ వారం మొత్తం కెప్టెన్సీ వ‌దులుకోవ‌ల‌సి ఉంటుంది. రెండోది వ‌చ్చేవారం నామినేష‌న్‌లో సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి. మూడోది ఈ సీజ‌న్ మొత్తం సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి. గ‌ణేష్‌, నందిని,సున‌య‌న ఈ ముగ్గురు పైన తెలిపిన మూడు త్యాగాల‌లో ఒక్కొక్క‌రు ఒక్కోటి సెల‌క్ట్ చేసుకొని అది బిగ్ బాస్‌కి తెలపాల్సి ఉంటుందని అన్నారు. ఈ మూడు టాస్క్‌లు అంత‌గా బాలేవ‌ని ముగ్గురిలో ఎవ‌రు ఆ త్యాగాల‌కి సిద్ధ‌ప‌డ‌లేదు. దీంతో ఫోన్ టాస్క్ ముగిసిందని బిగ్ బాస్ తెలియ‌జేశారు.


ఇక 47వ రోజు కెప్టెన్ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌజ్‌లోకి పాన్ షాప్ వ‌చ్చేసింది. ఆ పాన్ షాప్ య‌జమానిగా అంద‌మైన అమ్మాయి పూజా రామ‌చంద్ర‌న్ ఉంటుంద‌ని అన్నారు. య‌జ‌మానిని ఫ్ల‌ట్ చేసేందుకు అబ్బాయిలు, మెప్పించేందుకు అమ్మాయిలు ప్ర‌య‌త్నిస్తూ ఉండాలి. టాస్క్ చివ‌రిలో బిగ్ బాస్ అడిగిన‌ప్పుడు పూజా ఇద్ద‌రు అబ్బాయిల పేర్లు, ఇద్ద‌రు అమ్మాయిల పేర్లు తెలియ‌జేయాల్సి ఉంటుంది. పూజాని మెప్పించేందుకు పాట‌లు పాడొచ్చు, క‌విత‌లు చేప్పొచ్చు, డ్యాన్స్ లు చేయోచ్చు. మ‌రోవైపు పూజా.. త‌న‌కి ఏం కావాలో అది అడ‌గ‌వొచ్చు అంటూ బిగ్ బాస్ ఈ టాస్క్ నియమాలు తెలిపారు. ఇక గార్డెన్ ఏరియాలో ఉన్న కిళ్ళీ షాప్‌ని చూసిన స‌భ్యులు గోల చేశారు. ఈ లోపే కిళ్ళీ కిళ్ళీ అనే సాంగ్ ప్లే కావ‌డంతో ఇంటి స‌భ్యులు అంద‌రు అదిరిపోయే స్టెప్ప‌లు వేశారు.


 


బిగ్ బాస్ చెప్పిన‌ట్టు పూజాని మెప్పించ‌డం కోసం కంటెస్టెంట్స్ ఒకరిని మించి ఒక‌రు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు.ప‌ద‌కొండు మంది కంటెస్టెంట్స్ లో అమ్మాయిల నుండి దీప్తి నల్లమోతు, గీతా మాధురి లు అబ్బాయిల నుండి సామ్రాట్, అమిత్‌లను ఎంపిక చేసింది పూజా. దీంతో ఈ న‌లుగురు కెప్టెన్సీ పోటీ దారులుగా ఎంపికైన‌ట్టు బిగ్ బాస్ తెలిపారు. ఇక ఆ త‌ర్వాత కొద్ది సేపు ఇంటి స‌భ్యులు చ‌ర్చ‌లు జ‌రిపారు. రోల్ రైడా బిగ్ బాస్ కి సంబంధించి ఓ ర్యాపో సాంగ్ పాడారు. దీంట్లో అంద‌రు పాలు పంచుకున్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్ కోసం స‌మ‌యం ఆస‌న్నం కావడంతో టాస్క్ కోసం ఏం చేయాల‌నేది త‌నీష్ చ‌దివి వినిపించారు. బిగ్ బాస్ ఇచ్చిన టీష‌ర్ట్‌ని ధ‌రించ‌డంతో పాటు ఒంటికి బాడీ పెయింట్ వేసుకొని స్టాచ్యూలా రెడీ అయి కెప్టెన్సీ పోటీ దారులు న‌లుగురు టాస్క్ ముగిసేవ‌ర‌కు స్టూల్‌పై క‌ద‌ల‌కుండా నిలుచోవాలి. ఎవ‌రైతే ఎక్కువ సేపు నిలుచుంటారో వారే ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్‌గా ఉంటారని చెప్పారు. అయితే ఈ టాస్క్‌లో పోటీ దారుల‌కి మ‌ద్దతుగా ఉన్న ఇంటి స‌భ్యులు కెప్టెన్ టాస్క్‌లో పాల్గొన్న మిగ‌తా వారిని కింద‌కి దించ‌డానికి ఏమైన చేయోచ్చు అని మెలిక పెట్టారు బిగ్ బాస్.


రంగులు ధరించి స్టాచ్యూలా నిలుచొన్న కెప్టెన్ పోటీ దారులు అమిత్ , సామ్రాట్‌, దీప్తి , గీతా మాధురిలు బ‌జ‌ర్ మోగ‌గానే టాస్క్‌ మొద‌లు పెట్టారు. స్టూల్స్‌పైన ఉన్న వారిని దించేందుకు మిగ‌తా ఇంటి స‌భ్యులు అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. కొంద‌రు ఒంటిపై నూనె పోస్తే మ‌రి కొంద‌రు కోడిగుడ్డు సొన పోశారు. అయితే కౌశ‌ల్ చేసిన ప‌నుల‌కి త‌నీష్‌,నందిని, పూజా త‌దిత‌రులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. గతంలో నేను కెప్టెన్‌ టాస్క్‌లో పాల్గొన్నప్పుడు నా ముఖంపై పసుపు కొట్టారని.. ఇప్పుడు నేను నూనే పోస్తే తప్పంటున్నారని కౌశల్ కౌంటర్ ఇచ్చారు. అప్పుడు త‌నకి జ‌రిగిన దానికి కౌశ‌ల్ పెద్ద ఇష్యూ చేయ‌గా, ఇప్పుడు అది క‌రెక్టే అంటున్నాడు అని త‌నీష్ అన్నాడు. ఈ విష‌యంలో తనీష్‌, కౌశ‌ల్ మ‌ధ్య చాలా సేపు చ‌ర్చ జ‌రిగింది.


కెప్టెన్ కోసం జ‌రిగిన హోరా హోరీ టాస్క్‌లో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి.బాగు గోగినేని స్టూల్‌పై ఉన్న దీప్తిని దించే క్ర‌మంలో బ‌కెట్ త‌గిలించ‌డంతో ఆమె కింద ప‌డింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన కౌశ‌ల్ స్టూల్‌పై ఉన్న అమిత్‌, సామ్రాట్‌ల‌ని స్టిక్‌తో కిందకి దించాడు. ఈ క్ర‌మంలో ఇంటి స‌భ్యుల మ‌ధ్య చిన్న‌పాటి ర‌చ్చ జ‌రిగింది. కౌశ‌ల్ ఈ విష‌యంలో త‌ను చూసిన దానిపై క్లారిటీ ఇవ్వ‌గా, బాబు గోగినేని కూడా ఏం జ‌రిగింద‌నే విష‌యంపై కొద్ది సేపు వాదన జ‌రిపారు. ఇక చివ‌ర‌కి గీతా మాధురి ఒక్కరే ఫైనల్ వరకూ స్టూల్‌పై నిలవడంతో ఆమె ఈ వారం కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యారు. వెంట‌నే కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ని స్వీకరించ‌మ‌ని బిగ్ బాస్ అన్నారు. కెప్టెన్‌లుగా ఉన్న త‌నీష్‌, గీతాలు ఇంటి పనులు చేశారురు. ఈ సారి నుండి ఎవ‌రు అలా చేయ‌డానికి వీలు లేదు అంటూ బిగ్ బాస్ ఆదేశించారు.


 


ఈ వారం కెప్టెన్‌గా ఎంపికైన గీతా ప‌ట్ల బాబు గోగినేని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దీప్తి, సామ్రాట్‌ల‌లో ఒక‌రిని కెప్టెన్ చేద్దామ‌ని అనుకున్నాం. అక్క‌డ గొడ‌వ జ‌రుగుతున్నా మీరు ఏం ప‌ట్ట‌నట్టు ఉన్నారు. ఈ విష‌యంలో గీతా, బాబుల మ‌ధ్య తీవ్ర చ‌ర్చ జ‌రిగింది. దీప్తిని స‌పోర్ట్ చేయాల‌నుకున్న మీరు ఆమెపై నీళ్లు ఎందుకు పోశారంటూ గీతా ప్రశ్నించింది. మీరు కెప్టెన్‌గా లీడ‌ర్ షిప్ ఇవ్వాలి హౌజ్‌కి. కూర్చొని గ్రూప్‌లు చేయ‌కండి అంటూ దీప్తిపై ఫైర్ అయ్యారు బాబు గోగినేని. డిస్క‌ష‌న్‌లో నిజాయితీ లేని మీతో నేను చ‌ర్చ జ‌ర‌ప‌న‌న్న బాబు, ఆక‌తాయి మాట‌లు మాట్లాడి ఎదుటి వారి ఉద్దేశాలు మాట్లాడ‌డానికి వీల్లేదు అని అన్నారు. నాకు మాట్లాడాల‌ని లేక‌పోయిన మీ వ‌య‌స్సుకు వాల్యూ ఇచ్చి మాట్లాడుతున్నానంటూ గీతా తెలిపింది. కెప్టెన్సీ మొద‌ట్లోనే గ్రూపుయిజం మొద‌లు పెట్టార‌ని బాబు అన‌గా మ‌ధ్య‌లో కౌశ‌ల్ ఇన్వాల్వ్ అయ్యాడు. దీంతో సామ్రాట్‌, తనీష్‌లు వాళ్లిద్ద‌రిని మాట్లాడుకోనివ్వండి అంటూ కౌశ‌ల్‌కి సూచ‌న‌లిచ్చారు. దీంతో 47వ ఎపిసోడ్ పూర్తైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa