సుశాంత్, రుహాణి శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం చిలసౌ. రాహుల్ రవీంద్రన్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రోహిణి, అనుహాసన్‌లు ఇతర పాత్రధారులు. భారత్ కుమార్ మాలాసల, హరి పులిజల, జస్వంత్ నదిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియెస్, సిరునీ సినీ కార్పోరేషన్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa