నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా 'థాంక్యూ'. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది.'ఇష్క్', 'మనం', '24', 'హలో' వంటి సినిమాలని రూపొందించిన టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో అవికా గోర్, మాళవిక నాయర్, సాయి సుశాంత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా టీజర్ మే 25న సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa