ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 09:24 PM

కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘విక్రమ్’.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ  సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ  సినిమాలో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉండడంతో ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ సినిమా రన్‌టైమ్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 58 నిమిషాలకు లాక్ అయిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య కూడా  ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ  సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa