వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్-3 సినిమా మే 27న థియేటర్లలో విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా’ అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. 1.20 నిమిషాల నిడివిగల ఈ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పూజాహెగ్డే ఈ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. దేవీ శ్రీ ప్రసాద్ స్వర పరిచిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. రాహుల్ సిప్లీగంజ్, గీతా మాధురి ఆలపించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. వెంకీ, వరుణ్ లకు జోడీగా తమన్నా, మెహరిన్ లు నటించారు. సునీల్, సోనాల్‌చౌహన్, రాజేంద్రప్రసాద్ లు కీలకపాత్రల్లో నటించారు.