బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సింగపూర్ నుంచి వస్తూ.. ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఇక ఫోటోగ్రాఫర్లు వదిలిపెడతారా.. ఆమెను ఫోటోల మీద ఫోటోలు తీసి, మీడియా మాధ్యమాల్లో ప్రచురించాయి. అయితే ఈ ఫోటోల్లో ఆమె వేసుకున్న టీ-షర్ట్, షూ ఖరీదు వింటే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. ఆమె వేసుకున్న క్రీమ్ కలర్ కాటన్ జెర్సీ ఖరీదు రూ.33 వేలట. ఇది చిన్న స్లీవ్‌తో ఉన్న సెయింట్ లారెంట్ బాయ్‌ఫ్రెండ్ టీ-షర్టు. జాన్వీ టీ-షర్ట్‌తో పాటు ఆమె వేసుకున్న షూ కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. తెలుపు రంగుల్లో పింక్, బ్లూ రంగులో లెదర్‌ను కలిగి ఉన్న ఈ షూస్, దాదాపు 1.37 లక్షల రూపాయలట. జాన్వీ వేసుకున్న ఈ టీ-షర్ట్‌ను, షూను రెండింటినీ కూడా స్పెయిన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ బ్యాలెంసీగా నుంచి తెప్పించినవట. ఈ బ్రాండ్ ఫ్రెంచ్ మల్టినేషనల్ కంపెనీ కెరింగ్‌కు చెందినది. కాగ, ధడక్ మూవీ ప్రమోషన్స్ నుంచి ఆమె స్టయిల్ లుక్స్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa