ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన నరేష్ అగస్త్య కొత్త సినిమా

cinema |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 05:11 PM

మత్తు వదలారా, సేనాపతి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. నరేష్ అగస్త్య ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈరోజు ఈ యంగ్ హీరో కొత్త సినిమా హైదరాబాద్‌లో అధికారికంగా ప్రారంభమైంది. అహ నా పెళ్లంట, పూల రంగడు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వీరభద్రం చౌదరి ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమా జూలై 2022 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది అని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. జయ దుర్గాదేవి మల్టీమీడియా మరియు డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్లపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa