ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ప్రారంభం కానున్న విజయ్ సేతుపతి బాలీవుడ్ సినిమా కొత్త షెడ్యూల్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 02:20 PM

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక హిందీ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'మెర్రీ క్రిస్మస్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కథానాయిక గా నటిస్తుంది. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆమె పోలీసుగా కనిపించనుంది. తాజాగా ఇప్పుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి 'మెర్రీ క్రిస్మస్' సినిమా షూటింగ్‌ను తిరిగి ఈరోజు ప్రారంభించనున్నారు. ముంబైలో జరగనున్న ఈ షెడ్యూల్ నెల రోజుల పాటు జరగనుందని సమాచారం. మ్యాచ్‌బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీ టిప్స్ ఇండస్ట్రీస్ ఈ సినిమాని నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa