ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన తదుపరి ప్రాజెక్ట్ గురించి వెల్లడించిన వరుణ్ తేజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 02:33 PM

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో కలిసి ఒక సినిమా చేస్తున్నట్లు అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి టెంపరరీగా 'VT12' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. VT12 సినిమా హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ ఆలయంలో అధికారిక పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ సినిమాలో వరుణ్ సరసన జోడిగా సాక్షి వైద్యను బోర్డులోకి తీసుకున్నారు. తాజగా వరుణ్ తేజ్ 'ఎఫ్ 3' ప్రొమోషన్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఈ సినిమా లండన్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ అని వెల్లడించాడు. ఈ చిత్రం పూర్తిగా లండన్‌లో చిత్రీకరించబడుతుందని కూడా ఆయన చెప్పారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో కనిపించనున్నాడు అని సమాచారం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ అండ్ బాపినీడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa