మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అఖిల్ అక్కినేని చేస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమాతో సాక్షి వైద్య తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతుంది. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. హిప్ హప్ తమిళ బాణీలందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి ఆదరణను దక్కించుకున్నాయి. హైదరాబాద్, వైజాగ్ తర్వాత మనాలి లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి అఖిల్ లుక్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. అందులో అఖిల్ డబల్ జాకెట్ వేసుకుని, ఉంగరాల జుట్టుతో, మంచులో ఉన్నట్టు కనిపిస్తాడు. ఈ మూవీ కోసం తన దేహాన్ని కండలు తిప్పి, జుట్టును పెంచి ఒక బీస్ట్ లా తయారైన అఖిల్ తాజాగా లీకైన ఫొటోలో హాలీవుడ్ సినిమా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో జాన్ స్నో లాగా కనబడుతున్నాడు. ఈ మేరకు అభిమానులు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు సంబంధించి జాన్ స్నో లుక్ ను, లీకైన అఖిల్ అక్కినేని లుక్ ను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa