నటి అనుపమ పరమేశ్వరన్ తన రిలేషన్ షిప్ స్టేటస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్పింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. మీరు సింగిల్‌గానే ఉన్నారా? అని అడగ్గా.. 'నా రిలేషన్ షిప్ స్టేటస్ నాక్కూడా తెలియడం లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా. మరి, అవతలి సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. కాబట్టి వన్ సైడ్ లవ్ అని చెప్పగలను' అని చెప్పింది.