ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రానా నాయుడు' సిరీస్ గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 31, 2022, 12:56 PM

కరణ్ అన్షుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తన మొదటి వెబ్ సిరీస్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి 'రానా నాయుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. టాలీవుడ్ హ్యాండ్సమ్ హల్క్ రానా దగ్గుబాటి కూడా కనిపించనున్నారు. తాజాగా ఇటీవలే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్ ఈ తెలుగు క్రైమ్ డ్రామా సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, రాజేష్ జైస్ మరియు ప్రియా బెనర్జీ  కీలక పత్రాలు పోషిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రైమ్ డ్రామా పాపులర్ అమెరికన్ టీవీ సిరీస్ 'రే డోనోవన్' కి ఆధారంగా రూపొందిస్తున్నారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా LLPకి చెందిన సుందర్ ఆరోన్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa