పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్టుతో ఈ సినిమాను నిర్మించారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ అందమైన ప్రేమ కథ ఇటీవల విడుదలై భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. ప్రభాస్ నుండి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ను కోరుకునే ప్రేక్షకులకు ఈ క్లాస్ లవ్ ఎంటర్టైనర్ అంతగా నచ్చలేదనే చెప్పాలి. కానీ ప్రభాస్ అభిమానులకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా తెగ నచ్చేసింది. థియేటర్లలో ఉసూరుమనిపించిన రాధేశ్యామ్ డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది. ప్రముఖ నెట్ ఫ్లిక్స్ లో మే 4వ తేదీ నుండి రాధేశ్యామ్ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. 25 రోజులుగా నెట్ ఫ్లిక్స్ టాప్-10 ట్రెండింగ్ లో రాధేశ్యామ్ స్థానం సంపాదించుకుంటూ రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో 3 వారాలకు పైగా కొనసాగేవి హాలీవుడ్ చిత్రాలు, ఇంగ్లిష్ వెబ్ సిరీస్ మాత్రమే. అలాంటిది రాధేశ్యామ్ సినిమా 25 రోజులుగా ట్రెండింగ్ లో ఉండటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa