బాలీవుడ్ ప్రేక్షకులు అమితాసక్తి తో ఎదురుచూస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్టుతో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. మోడర్న్ మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అస్త్రవర్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ గ్లిమ్స్ ను విడుదల చేసారు. చిత్రంలో కీలక పాత్రలు పోషించిన ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను జూన్ 15వ తేదీన విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa