ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరలవుతున్న ఆర్ఆర్ఆర్ ట్రైన్ సీన్ మేకింగ్ వీడియో

cinema |  Suryaa Desk  | Published : Tue, May 31, 2022, 04:13 PM

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన దృశ్య కావ్యం ఆర్ ఆర్ ఆర్. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన నాల్గన సినిమాగా రికార్డు సృష్టించింది. రాజమౌళి సినిమాలంటే VFX ఎఫెక్ట్స్ కు పెద్ద పీట ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ లో కూడా రామ్, భీం ల ఇంట్రో సీన్ కోసం రాజమౌళి అండ్ టీం మొత్తం VFX మీదనే ఆధారపడ్డారు. ఎంత VFX ఎఫెక్ట్స్ తెరపై కనిపించినా ఆ సీన్ ను ప్రొడ్యూస్ చేసిన రాజమౌళికే ఆ క్రెడిట్ అంతా ఇవ్వాలి. ఈ భారీ యాక్షన్ సీన్ కోసం విదేశీ సాంకేతిక బృందం చాలా కష్టపడింది. ముందుగా ఆ బృందం రాజమండ్రిలోని బ్రిటిష్ కాలం నాటి రోడ్ -రైల్ మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడి వాతావరణం, జియోగ్రఫీ మీద ఒక అభిప్రాయానికొచ్చింది. ఆ తర్వాత రైల్ బోగీలను స్పెషల్ గా తయారు చేసి వాటిని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ కు తీసుకొచ్చారు.  దీనికన్నా ముందు రెండు పిల్లర్ల సాయంతో రైల్వే బ్రిడ్జ్ మార్గంపై రామ్ భీం ల సీన్ ను తెరకెక్కించారు. ఆ తర్వాత ఇక మొత్తం VFX దే బాధ్యత. తెరపైన ఈ సీన్ ను రియలిస్టిక్ గా చూపించిన సాంకేతిక బృందం డెన్మార్క్ కు చెందిన సుర్పరీజ్ VFX స్టూడియోస్ వారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa