MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్) గా నటిస్తున్నాడు. నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 12, 2022న విడుదల కానుంది. ఈ సినిమా మొదటి సింగిల్ 'చిల్ మారో' ని హైదరాబాద్‌లో జరిగిన 'విక్రమ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఉలగ నాయగన్ కమల్ హాసన్ పాటను లాంచ్ చేశారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా, మహతి స్వర సాగర్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసారు. శ్రేష్ట్ మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ చిత్రాన్ని విడుదల చేయనుంది అని అందరికి తెలిసిన విషయమే. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాని ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.