అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని అందుకుంటుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా నాలుగవ రోజున తెలుగు రాష్ట్రాల్లోనే 4.64 కోట్లు వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద నాలుగు రోజులకు గాను ఈ సినిమా టోటల్ గా 32.11 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం - 2.03 కోట్లు
UA - 0.66 కోట్లు
గుంటూరు - 0.28 కోట్లు
వెస్ట్ - 0.20 కోట్లు
ఈస్ట్ - 0.34 కోట్లు
నెల్లూరు - 0.14 కోట్లు
కృష్ణ - 0.28 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ - 32.11 కోట్లు