ప్రసాత్ మురుగేషన్‌తో కలిసి జయలలిత జీవితంపై గౌతమ్ మీనన్ ఒక బయోపిక్‌ని డైరెక్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. 'క్వీన్' అనే టైటిల్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషించింది. జయలలిత పాత్రలో ఆమె నటనకు రమ్యకృష్ మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సిరీస్ రెండో సీజన్ షూటింగ్ చెన్నైలో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సీజన్‌లో జయలలితకి రాజకీయ ఒడిదుడుకులు ఎదురవుతాయని, థ్రిల్లర్‌గా ఉంటుందని మూవీ మేకర్స్ వెల్లడించారు. MX ప్లేయర్ లో ప్రసారం కానున్న ఈ సీజన్ కోసం తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.