లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విక్రమ్' సినిమా జూన్ 3, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, డైరెక్టర్ లోకేష్ హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితం ప్రభాస్‌ను కలిసినట్లు ఒక స్క్రిప్ట్ ని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్క్రిప్ట్ ప్రభాస్ కు నచ్చకపోవడంతో మరిన్ని మార్పులు చేయమని లోకేష్ ని అడగగా కొన్ని మార్పులు చేసి మరోసారి ప్రభాస్‌కి వివరించినట్లు సమాచారం. కానీ ప్రభాస్ కి కథ నచ్చక ఆ సినిమాను సున్నితంగా తిరస్కరించాడట.