ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి నటించిన 'KGF 2' ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ఆఫీస్ వద్ద 1000 కోట్లు వసూలు చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే, కొన్ని రోజుల క్రితం OTT ప్లాట్‌ఫారమ్ మే 16, 2022న పే-పర్-వ్యూ మోడల్‌లో మాగ్నమ్ ఓపస్ సినిమా ను విడుదల చేసింది. తాజాగా ఇప్పుడు ప్రైమ్ వీడియో 'KGF 2' జూన్ 3, 2022 నుండి సబ్‌స్క్రైబర్లందరి కి ప్రసారానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్,రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ పాన్-ఇండియా చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.