ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్ ఖాన్ తదుపరి సినిమా సెట్స్‌లో వెంకటేష్ ఈ తేదీన జాయిన్ కానున్నారా?

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 03:37 PM

ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్‌ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే జంటగా కనిపించనుంది. 'కభీ ఈద్ కభీ దివాళీ' అనే టైటిల్ ని ఈ మూవీ కి మేకర్స్ లాక్ చేసారు. ఆయుష్ శర్మ, జహీర్ ఇక్బాల్ సల్మాన్ సోదరులుగా నటిస్తుండగా, సాజిద్ నడియాడ్‌వాలా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడగా జూన్ 10, 2022న ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని సమాచారం. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఆచార్య టెంపుల్ సెట్‌లో ప్రారంభమవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa