ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేజర్ నుండి దేశభక్తి గీతం 'జనగణమణ' రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 09:49 PM

భారతీయ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'మేజర్'. 2008 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా, శశికిరణ్ తిక్కా మేజర్ చిత్రాన్ని రూపొందించారు. లీడ్ రోల్ లో అడవి శేష్ నటించటంతో పాటు ఈ చిత్రానికి రచయితగాను పనిచేసారు. సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్,A +S మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది.


ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, లిరికల్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. ఈ సినిమా నుండి 'జనగణమణ' అనే దేశభక్తి గీతం విడుదలైంది. శ్రీచరణ్ పాకాల సంగీతమందించగా, రాజీవ్ భరద్వాజ్ సాహిత్యాన్ని అందించారు. తోజన్ టోబి, శ్రీచరణ్ పాకాల ఆలపించారు. జయహే జయహో.. ఎగిరే కలలో..అని సాగే ఈ పాట ప్రతి ఒక్కరిలో ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa