లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన "విక్రమ్" సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా 'యూనివర్సల్ యాక్టర్' కి వీరాభిమాని అయిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఒక ఎమోషనల్ నోట్ ని పంచుకున్నారు. తన అభిమాన నటుడిని డైరెక్ట్ చేయడం తనకు ఎలా అనిపించిందో, టీమ్ మొత్తం ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారో ఈ లేఖలో వ్యక్తం చేశాడు. పెద్ద ఎత్తున పనిచేసిన ప్రతి ఒక్కరికీ లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు, విక్రమ్‌ని పెద్ద స్క్రీన్‌లపై చూసే ముందు 'కైతీ' ని మళ్లీ చూడాలని ప్రేక్షకులను అభ్యర్థించాడు. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.