రాజమోళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ముఖ్యపాత్రలు పోషించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన ఆర్ ఆర్ ఆర్ ఒక ఇండియాలోనే కాదు సుమారు 56 దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో విజృంభిస్తుంది. అయితే, ఆర్ ఆర్ ఆర్ లో రెండు విషయాలు మాత్రం అమెరికన్లకు విపరీతంగా నచ్చేశాయని తెలుస్తుంది.
పలువురు అమెరికన్ విమర్శకుల నుండి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి. అందరూ కూడా ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన రెండు విషయాలపై బాగా ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. అందులో ఒకటి.. నాటు నాటు పాట. ఆస్కార్ విన్నర్ లా లా ల్యాండ్ వంటి సినిమాలతో ఈ సినిమాను పోల్చటం నిజంగా ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవం. హాలీవుడ్ సిల్వర్ స్క్రీన్లపై నాటు నాటు లాంటి పాటను, చెర్రీ, తారక్ లు చేసిన మాస్ స్టెప్పులను రూపొందించాలని అనుకుంటున్నారట.
ఆర్ ఆర్ ఆర్ లో అమెరికన్లను ఆకర్షిస్తున్న మరో అంశం యాక్షన్ సీక్వెన్సెస్. రాజమౌళి రూపొందించిన ఆర్ ఆర్ ఆర్ యాక్షన్ ఎపిసోడ్స్, హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉండటంతో అమెరికన్లు ఆర్ ఆర్ ఆర్ సినిమాను బాగా ఇష్టపడుతున్నారట. అవెంజర్స్ సినిమా తో ఆర్ ఆర్ ఆర్ యాక్షన్ ఎపిసోడ్స్ ను పోల్చటం విశేషం. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు అమెరికాలో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణకు, రాజమౌళి అండ్ టీం లాస్ ఏంజెల్స్ కు వెళ్లి స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించి సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని అమెరికన్లకు వివరించినా ఆశ్చర్యపోనవసరం లేదు.