టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో స్టార్ హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2. 2018లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 ను తెరకెక్కించారు. ఎఫ్ 2 లో లీడ్ రోల్స్ చేసిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లే ఎఫ్ 3 లో కూడా లీడ్ రోల్స్ చేసారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. వేసవి కానుకగా, సాధారణ టికెట్ రేట్లతో మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 3 చిత్రం తొలివారంలో రూ. 50 కోట్ల షేర్ ను రాబట్టింది.
మొదటి వారంలో ఎఫ్ 3 మూవీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో - రూ. 41. 06 కోట్లు, కర్ణాటక - రూ. 2.3 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 1.5 కోట్లు, ఓవర్సీస్ - రూ. 7. 2 కోట్లు, మొత్తం కలిపి ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ 3 మూవీ రూ. 52. 1 కోట్ల షేర్ ను, రూ. 94 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. వంద కోట్లను త్వరలోనే అందుకోనుంది. ఈ రోజుతో ఎఫ్ 3 రెండవ వారంలోకి అడుగుపెట్టింది. విక్రమ్, మేజర్, పృథ్విరాజ్ వంటి బిగ్ సినిమాలు వచ్చినా కానీ, వీటిల్లో ఎఫ్ 3 ఒక్కటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఇప్పుడప్పుడే ఎఫ్ 3 థియేటర్లకు ప్రేక్షకుల రద్దీ తగ్గకపోవచ్చు