ఇటీవల విడుదలైన వరుణ్ తేజ్ కొత్త సినిమా "గని" తో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ సయీ మంజ్రేకర్. ఈమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు,నటుడు, గోపీచంద్ నటించిన ఒక్కడున్నాడు చిత్రంతో టాలీవుడ్ కు విలన్ గా పరిచయమైన మహేష్ మంజ్రేకర్ కూతురు. గని చిత్రం సయీ మంజ్రేకర్ కు అనుకున్నంత గుర్తింపును తీసుకురాలేదు కానీ, అడవి శేష్ నటించిన మేజర్ చిత్రం ఈ అమ్మడికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈరోజే విడుదలైన మేజర్ చిత్రంలో సయీ నటన కు ప్రేక్షకులు మంచి మార్కులు వేస్తున్నారు. దీంతో కొంతమంది టాలీవుడ్ దర్శకనిర్మాతలు సయీ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారట.
దర్శకనిర్మాతలెవరైనా కథను చెప్పటానికి సయీ వద్దకు వెళ్తే, వారిని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వద్దకు పంపిస్తుందట. సయీ ఎందుకిలా చేస్తుందని అందరూ షాక్ అవుతున్నారు. సల్మాన్ ఖాన్, సయీ తండ్రి మహేష్ మంజ్రేకర్ మంచి స్నేహితులు. కూతురి సినీ కెరీర్ ను మహేష్ సల్మాన్ చేతుల్లో పెట్టాడు. సయీ వెండితెరకు పరిచయమైంది సల్మాన్ ఖాన్ సినిమాతోనే. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 లో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. తాను చేస్తున్న సినిమాలే హిందీలో హిట్టవ్వట్లేదని సల్మాన్ సయీ తెలుగులో చేస్తున్న సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడట. చిన్న, మీడియం రేంజ్ హీరోలకు సయీ మంజ్రేకర్ డేట్స్ ఇవ్వదు. కేవలం పెద్ద దర్శక నిర్మాతలు, స్టార్ హీరోలైతేనే నటిస్తుందని సల్మాన్ కండిషన్స్ పెడుతున్నాడట.