కీర్తి సురేష్... రామ్ పోతినేని నటించిన నేను శైలజా చిత్రంతో తెలుగు సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, మిస్ ఇండియా, రంగ్ దే, గుడ్ లక్ సఖి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. తెలుగులో ఇటీవల కీర్తి నటించిన కొత్త చిత్రం సర్కారువారిపాట. సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా నటించింది. కెరీర్ మొదటి నుండి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న కీర్తి తొలిసారి తన రూటు మార్చి చేసిన చిత్రమిది. గ్లామర్ రోల్ లో కీర్తికి ప్రేక్షకులు పాస్ మార్కులే వేశారు. తమిళంలో సాని కాయిదం అనే సినిమాలో డీగ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. తెలుగులో చిన్ని అనే సినిమాగా రిలీజయ్యింది. తెలుగు ప్రేక్షకులకు కీర్తి డబుల్ ధమాకా ఇచ్చిందనే చెప్పాలి. ఒక పక్క గ్లామర్ రోల్ లో, మరో పక్క డీగ్లామర్ రోల్ లో నటించిన SVP, చిన్ని సినిమాలు ఒకే సమయంలో విడుదలయ్యాయి. రెండు పాత్రల్లోనూ కీర్తి వేరియేషన్ ను చూపించి తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కీర్తి ఎమోషనల్ నోట్ ను షేర్ చేసింది. ఇటీవలి గతం తనకు పరీక్షా కాలం లాంటిదని, తాను నటించిన సర్కారువారిపాట, సాని కాయిదం చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలను తెలిపింది. సాని కాయిదం, SVP చిత్రబృందాలకు కృతజ్ఞతలు తెలిపింది. SVP షూటింగ్ సమయంలో తనకు సహకరించిన నమ్రత కు కీర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ... గొప్ప కోస్టార్ అని, ఆయనతో పని చెయ్యటం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.